ఓయూలో రేపు జాబ్​ మేళా

హైదరాబాద్, వెలుగు: ఓయూలోని ఎంప్లాయ్​మెంట్​ ఇన్ఫర్మేషన్​ అండ్​ గైడెన్స్​ బ్యూరో, మోడల్​ కెరియర్ సెంటర్​లో గురువారం మినీ జాబ్​ మేళా జరుగనుంది. సెంటర్​ డిప్యూటీ చీఫ్​ ఆఫీసర్​ టి.రాము మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిలయన్స్​ జియో, పేటీఎం, కాలిట్​ హెచ్ఆర్​, ఇన్నోవ్​ సోర్స్​ సర్వీసెస్, శుభ గృహ ప్రాజెక్ట్స్, పేరం గ్రూప్​ ప్రైవేట్ కంపెనీల్లో హైదరాబాద్​ కేంద్రంగా పనిచేసేందుకు సుమారు 400 ఉద్యోగాలకు ఎంపిక కోసం మేళా నిర్వహిస్తున్నామన్నారు. 19 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ తదితర విద్యార్హతలున్నవారు పాల్గొనవచ్చని.. ఫీల్డ్​ సేల్స్​ ఎగ్జిక్యూటివ్, కస్టమర్​ కేర్​ ఎగ్జిక్యూటివ్, బిజినెస్​ డెవలప్​మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్​ ట్రైనీస్, ప్రమోటర్స్, మార్కెటింగ్​ మేనేజర్స్ ఉద్యోగాలున్నాయన్నారు. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని.. ఆర్ట్స్​ కాలేజీ బిల్డింగ్​ ఎదురుగా ఉన్న ఆఫీసులో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు.

For More News..

హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

టీఆర్ఎస్ ​కబ్జా చేసిన భూములతో లక్షల ఇండ్లివ్వొచ్చు

Latest Updates