100కు 30 మార్కుల వెయిటేజీ.. అర్హత లేకున్నా ఉద్యోగం

పారామెడికల్ పోస్టుల భర్తీపై తెగని పంచాయితీ

ఫలితాల కోసం 50 వేల మంది ఎదురుచూపులు

4,375 పోస్టులకు 2017 చివర్లో నోటిఫికేషన్

కనీస మార్కులు రాని కాంట్రాక్ట్ సిబ్బందికి వెయిటేజీ

క్వాలిఫై కాకున్నా వెయిటేజీతో ఉద్యోగం

కోర్టులో కేసులు వేసిన కొందరు నిరుద్యోగ అభ్యర్థులు

అధికారుల నిర్లక్ష్యంతో రెండేండ్లుగా కేసులు పెండింగ్

కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై సర్కారు మొగ్గు

ఆందోళన చెందుతున్న నిరుద్యోగ అభ్యర్థులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సర్కారీ దవాఖాన్లలో పారామెడికల్​పోస్టుల భర్తీని సర్కారు గాలి కొదిలేసింది. ఒక్కో విభాగంలో 25% నుంచి 40% పోస్టులు ఖాళీగా ఉండటంతో సిబ్బంది లేక రోగులకు సరైన సేవలందుతలేవు. 2017 చివర్లో వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా, నియామక ప్రక్రియ పూర్తి చేయలేదు. ఐదేండ్లలో 6 పారామెడికల్ పోస్టులనే ప్రభుత్వం భర్తీ చేసింది. ఇప్పుడు స్టాఫ్‌‌‌‌‌‌‌‌ రేషనలైజేషన్‌‌‌‌‌‌‌‌, కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు సర్కారు మొగ్గు చూపుతుండడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

2017లో నోటిఫికేషన్

సర్కారీ దవాఖాన్లలోని స్టాఫ్ నర్స్, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్మసిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం, రేడియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజియోథెరపిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర 4,375 పోస్టుల భర్తీకి 2017 నవంబర్​ నుంచి 2018 జనవరి వరకూ టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ పలు నోటిఫికేషన్లు ఇచ్చింది. సర్కారీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ సిబ్బందికి రాత పరీక్షలో 30% వెయిటేజీ ఇచ్చింది. వంద మార్కుల పరీక్షలో 30 మార్కులు వెయిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంపై కొందరు నిరుద్యోగులు కోర్టుకెక్కారు. కేసు కోర్టులో ఉండగానే, 2018 మార్చిలో టీఎస్ పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించింది. ఈ జనవరిలో ఫార్మసిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరిట్ లిస్ట్​ రిలీజ్ చేసింది. ఇందులో అర్హత మార్కులు సాధించని వారికి.. వెయిటేజీ మార్కులు కలిపి చోటు కల్పించింది. రూల్స్​కు వ్యతిరేకంగా లిస్ట్​ ఉందంటూ నిరుద్యోగులు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు‌‌‌‌‌‌‌‌ ధర్నా చేశారు. పొరపాటును అంగీకరించిన అధికారులు, మళ్లీ మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్​ ప్రకటించారు. రెండో లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కనీస అర్హత మార్కులు రాని కాంట్రాక్ట్ ఉద్యోగులకు చోటిచ్చారు. దీనిపై కోర్టులో నిరుద్యోగులు మరో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీగానీ, వైద్య ఆరోగ్య శాఖగానీ ఇప్పటివరకూ కౌంటర్ వేయలేదు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వీస్ వెయిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కులు కలిపే విషయంలో భారీగా డబ్బులు చేతులు మారాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అనర్హులకు మార్కులు కలపడమేకాక, సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల జారీలోనూ అక్రమాలు జరిగాయంటున్నారు. కోర్టు కేసు పరిష్కారం కాకుండా కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెబుతున్నారు. కేసులు వాపస్ తీసుకుంటేనే భర్తీ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేదంటే వాళ్లకే నష్టమని అధికారులు అంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఐదేండ్లలో 6 పోస్టులే భర్తీ

ఐదేండ్లలో 6 పారామెడికల్ పోస్టులనే ప్రభుత్వం భర్తీ చేసింది. తెలంగాణ వచ్చాక మంజూరు చేసిన 2,196 పోస్టులతోపాటు అంతకుముందే ఉన్న ఖాళీలతో కలిపి మొత్తం పారామెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీల సంఖ్య 7,647కు చేరింది. స్టాఫ్ కొరత సమస్యను వారం క్రితం జరిగిన సమీక్షలో అధికారులు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు కేసులు పరిష్కారమవకపోతే, కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేపడతామని మంత్రి చెప్పారు. దీనిపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates