వ్యాక్సిన్ వస్తోంది.. జాబ్స్​ తెస్తోంది..

నియామకాలు పెంచుతున్న కంపెనీలు 

హాట్‌‌స్పాట్లుగా టైర్ 2, 3 నగరాలు

టైర్ 2 నగరాల్లో హైరింగ్ 62% పెంపు 

రిక్రూట్‌‌మెంట్ సంస్థల సర్వేలో వెల్లడి

ముంబై: కొత్త ఏడాదిలో జాబ్ సీకర్స్‌‌కు గుడ్‌‌న్యూస్. కరోనా వ్యాక్సిన్ న్యూస్‌‌తో ఇండియన్ కంపెనీలు మళ్లీ కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నాయి. వైట్ కాలర్ జాబ్ మార్కెట్‌‌కు  ప్రస్తుతం టైర్ 2, టైర్ 3 నగరాలు హాట్‌‌స్పాట్లుగా ఉన్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. టీమ్‌‌లీజ్ సర్వే ప్రకారం  అక్టోబర్-–డిసెంబర్‌‌‌‌లో 21 శాతం కంపెనీలే రిక్రూట్‌‌మెంట్ గురించి ఆలోచించగా.. జనవరి–మార్చిలో 27 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్స్ వేస్తున్నాయి. ఈ సర్వేలో 21 రంగాలకు చెందిన 815 చిన్న, మధ్య, పెద్ద కంపెనీలు పాల్గొన్నాయి. రిక్రూట్‌‌మెంట్, స్టాఫింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ సీఐఈఎల్‌‌ హెచ్‌‌ఆర్ సర్వీసెస్‌‌ జరిపిన సర్వేలో కూడా టైర్ 2 నగరాల్లో హైరింగ్ పెంచాలని కంపెనీలు చూస్తున్నట్టు తేలింది. టైర్ 2 నగరాల్లో హైరింగ్ డిసెంబర్‌‌‌‌లో 62 శాతం పెరిగింది. క్వార్టర్ లెక్కన 22 శాతం ఎగిసింది. వచ్చే క్వార్టర్‌‌‌‌లో కూడా ఈ ట్రెండ్ మరింత పెరుగుతుందని సీఐఈఎల్ హెచ్‌‌ఆర్ సర్వీసెస్‌‌ స్టడీలో వెల్లడైంది. ఈ రిక్రూట్‌‌మెంట్ కంపెనీ జరిపిన సర్వేలో 27 సిటీల్లో 298 కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌‌లు పాల్గొన్నారు. హైరింగ్ యాక్టివిటీ పుంజుకోవడం అనేది వ్యాక్సిన్ సక్సెస్‌‌పై ఆధారపడి ఉందని టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌లు, హెచ్‌‌ఆర్‌‌‌‌ హెడ్‌‌లు అన్నారు. ఫలితంగా ఎకానమీ పెరుగుతుందని, కన్జంప్షన్ కోలుకుంటుందని పేర్కొన్నారు. ‘న్యూఇయర్‌‌‌‌లో ఎంప్లాయర్స్ హైరింగ్ యాక్టివిటీపై మరింత ఆశావహంతో ఉన్నారు’ అని టీమ్‌‌లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వీపీ రితుపర్న చక్రవర్తి చెప్పారు. వ్యాక్సిన్ న్యూస్‌‌తో చాలా కంపెనీలు హైరింగ్‌‌ను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు లుపిన్ గ్లోబల్ హెచ్‌‌ఆర్ ప్రెసిడెంట్ యశ్వంత్ మహాదిక్ చెప్పారు.

‘హైరింగ్ వచ్చే రెండు క్వార్టర్లలో ప్రీ కరోనా లెవెల్స్‌‌కు చేరుకుంటుంది. వ్యాక్సిన్ సక్సెస్ అయితే ఇది సాధ్యమవుతుంది’ అని మహాదిక్ చెప్పారు. జనవరి–మార్చిలోనే చాలా కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటుంటాయి. వ్యాక్సిన్ మార్కెట్‌‌లోకి రాబోతుందనే న్యూస్ ఈ సెంటిమెంట్‌‌ను మరింత బలపర్చిందని టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌లు చెప్పారు.  ఏప్రిల్ నుంచి నియామకాలు జరప వచ్చని టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్–హెచ్‌‌ఆర్ సురేష్ త్రిపాఠి అన్నారు. ‘హైరింగ్ సెంటిమెంట్ చాలా పాజిటివ్‌‌గా ఉంది. కానీ ఇది ఎక్కువగా వ్యాక్సిన్ సక్సెస్‌‌గా అందించడంపైనే ఆధారపడి ఉంది. ప్రాజెక్ట్‌‌ల కోసం, ఫ్యాక్టరీల కోసం మేము హైరింగ్ చేస్తుంటాం. ఐటీ సర్వీసెస్‌‌లో కూడా హైరింగ్ చేపడతాం’ అని ఆర్‌‌‌‌పీజీ ఎంటర్‌‌‌‌ప్రైజస్ గ్రూప్ హెచ్‌‌ఆర్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్ తెలిపారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఉద్యోగులకు ఒక ఆప్షన్‌‌గా ఉందని పేర్కొన్నారు. నాన్ టైర్ 1 నగరాలు హైరింగ్‌‌కు హబ్‌‌గా నిలుస్తున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది యాక్సిస్ బ్యాంక్‌‌ టైర్ 2, టైర్ 3 నగరాల్లో హైరింగ్ చేపడుతుందని ఆ బ్యాంక్ హెచ్‌‌ఆర్ తెలిపారు. సీట్ టైర్స్ కూడా చాలా వరకు తమ ప్లాంట్స్, సేల్స్ ఆఫీసులు ప్రస్తుతం టైర్ 2, 3 నగరాల్లోనే ఉన్నాయని, ఆ పట్టణాల్లో హైరింగ్‌‌ను కొనసాగిస్తామని తెలిపింది.

డిసెంబర్‌‌‌‌లో 14% జంప్…

నౌకరి జాబ్‌‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం డిసెంబర్‌‌‌‌లో హైరింగ్ యాక్టివిటీ నవంబర్‌‌‌‌తో పోలిస్తే 14 శాతం పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌ చూసుకుంటే మొత్తం హైరింగ్ యాక్టివిటీ కేవలం 10 శాతమే తగ్గింది. జాబ్ మార్కెట్ మళ్లీ కోలుకుంటుందనే దానికి ఈ ఇండెక్స్‌‌ చాలా క్లియర్‌‌‌‌ సంకేతాలను అందజేస్తోంది. ఇన్సూరెన్స్ సెక్టార్‌‌‌‌లో హైరింగ్ డిసెంబర్‌‌‌‌లో 45 శాతం పెరిగింది. కరోనాతో చాలా మంది ఇప్పుడు తప్పనిసరిగా తమ హెల్త్‌‌ కోసం ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చూస్తున్నారు. ఆటో, దాని సంబంధిత రంగాల్లో కూడా హైరింగ్ 33 శాతం పెరిగింది. ఇతర కీలక రంగాలు బీఎఫ్‌‌ఎస్‌‌ఐలో 18 శాతం, ఫార్మా అండ్ బయోటెక్‌‌లో 28 శాతం, ఎఫ్‌‌ఎంసీజీలో 21 శాతం, ఐటీ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో 11 శాతం చొప్పున డిసెంబర్‌‌‌‌లో హైరింగ్ యాక్టివిటీ పెరిగింది. మెట్రోల్లో పుణే, ఢిల్లీ బాగా రికవరీ అయ్యాయి. కోయంబత్తూర్‌‌‌‌లో హైరింగ్ గ్రోత్ అత్యధికంగా 30 శాతం ఉంది. టైర్ నగరాల్లో అహ్మదాబాద్ 20 శాతం, జైపూర్‌‌‌‌లో 15 శాతం హైరింగ్ పెరిగింది.

వ్యాక్సిన్ సక్సెస్‌‌పై ఆధారపడ్డ రిక్రూట్‌‌మెంట్ ప్లాన్స్

కొత్త కేసులు తగ్గుతుండటంతో పెరిగిన మూవ్‌‌మెంట్లు

టాప్ హైరింగ్ సెక్టార్లుగా హెల్త్‌‌కేర్, ఎఫ్‌‌ఎంసీజీ, రిటైల్, ఎడ్‌‌టెక్, ఈకామర్స్, టెక్ స్టార్టప్స్, ఐటీలు

బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చండీఘడ్​, ముంబై నగరాల్లో కంపెనీలు నియామకాలు చేపట్టాలని ఎక్కువ ఆసక్తి

For More News..

జాతీయ గీతం పాడుతూ ఏడ్చిన సిరాజ్

నెలలుగా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రోడ్లు డ్యామేజ్

ఎమ్మెల్యే ✖ కార్పొరేటర్​.. ఒకే పని రెండుసార్లు ప్రారంభం

Latest Updates