ట్రైబల్ ​వెల్ఫేర్ ​స్కూల్లో ఉద్యోగాలు

హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ బాయ్స్ స్కూల్ కు 35 పోస్టులను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్​ విధానంలో 30, ఔట్​సోర్సింగ్​లో 5 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పోస్టులను భర్తీ చేసుకోవచ్చంది. ప్రిన్సిపల్‌‌‌‌–1, జూనియర్ ​లెక్చరర్,  లైబ్రేరియన్–1, పీజీటీ–7, టీజీటీ–9, పీడీ–1, పీఈటీ–1, క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్​ టీచర్–1, సీనియర్​ అసిస్టెంట్–1, స్టాఫ్​నర్స్–1 పోస్టులను రెగ్యులర్​ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆఫీసు సబార్డినేట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఐసీటీ ఇన్ స్ట్రక్టర్, ల్యాబ్​ అటెండర్​ పోస్టులను ఔట్​సోర్సింగ్​పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates