ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు: అప్లై ఇలా చేయాలి

jobs-in-integrated-coach-factory-in-indian-railway

ఇండియన్ రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఫ్యాక్టరీ అధికారిక వెబ్ సైట్ www.icf.indianrailways.gov.in  లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. మే 20 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మాత్రం 24 జూన్ 2019 గా నిర్ణయించారు. 992 అంప్రెంటిస్ పోస్టులకు గాను నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు అధికారులు.

అప్రెంటిస్ పోస్ట్ వివరాలు: 

కార్పెంటర్: 80 పోస్టులు

ఎలక్ట్రీషియన్: 200 పోస్టులు

ఫిట్టర్: 260 పోస్టులు

మెకానిస్ట్: 80 పోస్టులు

పెయింటర్: 80 పోస్టులు

వెల్డర్: 290 పోస్టులు

సెలక్ట్ అయిన వారికి  1 సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ / డిప్లొమా వంటి అధిక అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హత లేనట్టుగా తెలిపారు అధికారులు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మరింత సమాచారం పొందవచ్చు.

Latest Updates