ఐటీఐ ట్రేడ్స్​..ఎర్లీ జాబ్స్​

ఐటీఐ.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రీషియన్​, ఫిట్టర్​, మెషినిస్ట్​, డీజిల్​ మెకానిక్​, మోటార్​ మెకానిక్, టర్నర్​, వెల్డర్​, వైర్​మెన్​ డ్రాఫ్ట్స్​మెన్​ ట్రేడులే. కానీ సైన్స్, ఆర్ట్స్​, హ్యూమానిటీస్​, ఇంజినీరింగ్​, ఐటీ, అగ్రికల్చర్​ హెల్త్​కేర్​, ఫ్యాషన్​, బ్యాంకింగ్ ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాలకు సంబంధించి దాదాపు 140 పైగా ఐటీఐ ట్రేడులున్నాయి. పదోతరగతి తర్వాత రెండేళ్ల కోర్సు, ఆపై ఏడాది అప్రెంటీస్​తో గ్యారంటీ ఉపాధి అందించడంతో పాటు ఉన్నత చదువులకు మార్గం చూపుతున్న  ఇండస్ట్రియల్​ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్​ (ఐటీఐ)​ ట్రేడులు, కెరీర్​ ఆపర్చునిటీస్​ తదితర అంశాల సమాహారం.

వృత్తి విద్యా కోర్సుల్లో స్కిల్​ ఎన్​హాన్స్​మెంట్​ అండ్​ డెవలప్​మెంట్​ కోసం ప్రవేశపెట్టిన ఐటీఐ ట్రేడులను మినీ కోర్సులు అని చెప్పవచ్చు. ఫుల్​ టైం డిగ్రీల కంటే తక్కువగా ఇండస్ర్టీకి కావాల్సిన స్థాయిలో సిలబస్​ను టీచ్​ చేస్తూ స్కిల్ డెవలప్​మెంట్​ ట్రైనింగ్ ఇవ్వడం వీటి ప్రత్యేకత. జీవితంలో త్వరంగా సెటిలవ్వాలనుకునేవారు, ఉన్నత సదువులు చదవలేని వారికి ఇవి ఒక వరం అని చెప్పవచ్చు. సత్వర ఉపాధి లభించడంతో పాటు డిప్లొమా, ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ కోర్సులు చదువుకునే వెసులుబాటు కూడా ఈ ట్రేడుల్లో ఉంది.

మన రాష్ర్టంలో ప్రభుత్వరంగంలో 62, ప్రైవేటులో 214 మొత్తం 276 ఐటీఐలున్నాయి. వీటిల్లో 82 వేల సీట్లు అందుబాటులో ఉండగా ఏటా దాదాపు 60 వేల మంది చేరుతున్నారు. ఇంజినీరింగ్​ అండ్​ నాన్​ ఇంజినీరింగ్ అనే రెండు విభాగాల్లో 30 ట్రేడులు (ఇంజినీరింగ్–7, నాన్​ ఇంజినీరింగ్​–23) ఉన్నాయి. సాధారణంగా ఐటీఐ కోర్సుల కాలవ్యవధి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎస్ఎస్​సీ, సీబీఎస్​సీ, ఐసీఎస్ఈ, ఎన్​ఐవోఎస్​, టీవోఎస్​ఎస్, ఏపీవోఎస్​ఎస్ బోర్డుల ద్వారా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏడాది వ్యవధి గల కొన్ని కోర్సులకు ఎనిమిదో తరగతి వారిని కూడా అనుమతిస్తారు. కటాఫ్​​ తేదీ నాటికి కనీస వయసు 14 సంవత్సరాలు నిండాలి.

ప్రాక్టికల్స్​పై ఫోకస్​
ప్లేస్​మెంట్​ ఓరియంటెడ్​ ఇన్​స్టిట్యూట్స్​ కాబట్టి ఐటీఐ సిలబస్​లో 70 శాతం ప్రాక్టికల్స్​కు ప్రాధాన్యత ఇచ్చారు. ట్రేడ్ థియరీ, వర్క్‌‌షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, లైబ్రరీ అండ్ ఎక్స్‌‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌‌కు మిగిలిన 30 శాతం కేటాయించారు. రెండేళ్ల కోర్సుల్లో నాలుగు సెమిస్టర్లు, ఏడాది కోర్సులలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ప్రాక్టికల్స్​లో ఎక్కువగా ఇండస్ర్టీ వర్క్స్​, లైవ్​ ఎన్విరాన్​మెంట్​తో స్కిల్​ డెవలప్​మెంట్​ ట్రైనింగ్ ఇస్తారు. కోర్సు పూర్తి చేసుకొని ఉపాధి లభించని వారికి మరో అవకాశం అడ్వాన్స్​డ్​ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్ (ఏటీఐ)లు అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఇన్​స్టిట్యూట్​లలో ఐటీఐ అభ్యర్థులకు స్కిల్​ డెవలప్‌‌మెంట్ కోసం ప్రత్యేకంగా షార్ట్​టెర్మ్​ కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా నైపుణ్యాలు మెరుగుపర్చుకొని సులువుగా ఉద్యోగాలు పొందవచ్చు.

అప్రెంటీస్ తప్పనిసరి
ఐటీఐ పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందడానికి ముందు అభ్యర్థులు వివిధ ఇండస్ర్టీల్లో అప్రెంటీస్​ చేయాల్సి ఉంటుంది. డైరెక్టర్​ జనరల్ ఆఫ్​ ట్రైనింగ్ నిర్వహించే ఈ అప్రెంటీస్​ పూర్తి చేసిన వారికే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇన్​స్టిట్యూట్​లలో ఇచ్చే థియరీ, ప్రాక్టికల్​ట్రైనింగ్​తో పాటు ఇండస్ర్టీల్లో అప్రెంటీస్​ ట్రైనింగ్​ చేయడం ద్వారా అభ్యర్థులకు రియల్​టైమ్​ వర్క్​పై అవగాహన పెరిగి సులువుగా రాణిస్తారని ఈ నిబంధన పెట్టారు. సాధారణంగా ఈ అప్రెంటీస్​ ఒక ఏడాది ఉంటుంది. ఈ సమయంలో వారికి స్టైపెండ్​ కూడా చెల్లిస్తారు.

ఉద్యోగావకాశాలు
ఐటీఐలో ఏ ట్రేడ్​ చదివినా సత్వర ఉపాధి లభిస్తుందని చెప్పవచ్చు. జూనియర్​ లెవెల్‌‌లో అత్యధికమంది స్కిల్డ్​ వర్కర్లు అవసరం కాబట్టి వీరికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, స్వయం ఉపాధితో పాటు విదేశాల్లోనూ ఉద్యోగాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, టెలికాం, బీఎస్​ఎన్​ఎల్​, ఓఎన్​జీసీ, ఐవోసీఎల్​, ఎన్టీపీసీ, బెల్​, సెయిల్​, గెయిల్​, బీపీసీఎల్​, హెచ్​ఏఎల్​, ఏఏఐ, ఎన్​ఎఫ్​సీ, ఎన్​ఎండీసీ, బీఈఎల్​, నాల్కో, ఆర్​ఐఎన్​ఎల్​ వంటి వందలాది సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంలో దాదాపు అన్ని సంస్థల్లో ఐటీఐ ట్రేడ్స్​మన్​ అవసరం ఉంటుంది. అలాగే ప్లంబర్స్​, కార్పెంటర్స్​, కన్​స్ర్టక్షన్​ వర్కర్స్​, అగ్రికల్చర్​ వంటి వాటిలో స్వయం ఉపాధి పొందవచ్చు. విదేశాల్లో స్కిల్డ్​ వర్కర్ల కొరత  ఉండటంతో మన ఐటీఐ అభ్యర్థులకు ఇటీవల డిమాండ్​ పెరుగుతోంది.

ఎన్​సీవీటీ
జూనియర్​ లెవెల్లో స్కిల్డ్ వర్కర్స్ కొరతను అధిగమించడానికి క్రాఫ్ట్స్​​మన్​ ట్రైనింగ్​ స్కీమ్​ కింద 1950లో ఐటీఐలను ఏర్పాటు చేశారు. మొదట్లో తక్కువ ట్రేడులతో ప్రవేశపెట్టిన ఈ ఇన్​స్టిట్యూట్​లలో ప్రస్తుతం 140 రకాల కోర్సులున్నాయి. వొకేషనల్​ కోర్సుల కరిక్యులమ్, ఇతర విధివిధానాలు రూపొందించడం, ఆల్​ ఇండియా ట్రేడ్​ టెస్టులు నిర్వహణ, నేషనల్​ ట్రేడ్​ సర్టిఫికెట్​లు ప్రదానం చేయడం కోసం 1956లో నేషనల్​ కౌన్సిల్​ ఫర్​ వొకేషనల్​ ట్రైనింగ్​ (ఎన్​సీవీటీ) ని ఏర్పాటు చేశారు. కాలేజీలకు అనుమతి ఇవ్వడం, విద్యార్థులకు సర్టిఫికెట్​లు ప్రదానం చేయడం దీని ఇతర విధులు. ఎన్​సీవీటీ, నేషనల్​ స్కిల్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ(ఎన్​ఎస్​డీసీ) లను విలీనం చేసి నేషనల్​ కౌన్సిల్​ ఫర్​ వొకేషనల్​ ఎడ్యుకేషన్​ అండ్​ ట్రైనింగ్​ (ఎన్​సీవీఈటీ)ని ఏర్పాటు చేయడానికి 2018 అక్టోబర్​ 11న కేబినెట్​ ఆమోదం తెలిపింది. వొకేషనల్​ ఎడ్యుకేషన్​ మరియు ట్రైనింగ్​ విధివిధానాలను ఇప్పటినుంచి ఎన్​సీవీఈటీ పర్యవేక్షిస్తుంది. స్కిల్​ డెవలప్​మెంట్​ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్​ ఆఫ్​ ఎంప్లాయ్​మెంట్​ అండ్​ ట్రైనింగ్​ (డీజీఈటీ) ఆధ్వర్యంలో ఈ సంస్థలు పనిచేస్తాయి.

ఐటీఐ టు బీటెక్ వయా డిప్లొమా

ఇంజినీరింగ్​ ట్రేడ్​లో రెండేళ్ల ఐటీఐ పూర్తిచేసిన వారు డిప్లొమా, ఆ తర్వాత బీటెక్​ చేసే అద్భుత అవకాశం కూడా ఉంది. ఇందుకుగాను ఎన్​సీవీటీ నిర్వహించే ఆలిండియా ట్రేడ్​ టెస్ట్​ (ఏఐటీటీ) రాయాలి. ఏఐటీటీ లో ఉత్తీర్ణులైన వారికి ఎన్​సీవీటీ నేషనల్​ ట్రేడ్​ సర్టిఫికెట్​ (ఎన్​సీటీ) ని ప్రదానం చేస్తుంది. ఈ సర్టిఫికెట్​ కలిగిన ఇంజినీరింగ్​ ట్రేడ్​ అభ్యర్థులకు గుజరాత్​, రాజస్తాన్, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్​, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్​, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ర్టాలు ఎంట్రన్స్ టెస్ట్​లు నిర్వహించి లేటరల్​ ఎంట్రీ ద్వారా నేరుగా పాలిటెక్నిక్​ డిప్లొమా రెండో సంవత్సరంలో ప్రవేశం  కల్పిస్తున్నాయి. మన రాష్ర్టంలో డిప్లొమా అభ్యర్థులు ఈసెట్​ రాసి అదే లేటరల్​ ఎంట్రీతో బీఈ/బీటెక్​లో చేరొచ్చు. నాన్​ ఇంజినీరింగ్​ ట్రేడ్​ అభ్యర్థులు సాంప్రదాయ డిగ్రీ కోర్సులు చదువుకునే వెసులుబాటు ఉంది.

ఐటీఐపై చిన్నచూపు వద్దు
2008లో ఐటీఐలో కంప్యూటర్​​ గ్రాఫిక్​ కోర్స్​ చేశాను. చాలా మంది ఈ కోర్సులను చిన్న చూపు చూస్తారు. ఐటీఐ అయినా, ఐటీ అయినా టాలెంట్​ ఉంటే ఆయా రంగాల్లో రాణించవచ్చు. నేను ఐటీఐ తర్వాత డిప్లొమా యానిమేషన్​ కోర్సు చేశాను. ఏనిమిదేళ్లుగా ఈ రంగంలో పనిచేస్తున్నాను. ఏదైనా టెక్నికల్​ కోర్సు చేయడంవల్ల చాలా తొందరగా జాబులు దొరుకుతాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్​లో నెక్స్ట్​ ఎడ్యుకేషన్​లో కంపోజిటర్​గా పనిచేస్తున్నాను. నెలకు 40 వేలకుపైగా సంపాదిస్తున్నా. చిన్న వయసులోనే జాబ్​ కావాలనుకునేవారికి ఐటీఐ ట్రేడ్స్​ చాలా మంచి అవకాశం.

–సుమలత దుర్గ, హైదరాబాద్​

 

ఎక్స్​పీరియన్స్​తోనే
అధిక శాలరీ

– వెంకట శేఖర్​, తిరుపతి

ఇంజినీరింగ్

ఆర్కిటెక్చురల్​ అసిస్టెంట్స్​

బిల్డింగ్​ మెయింటెనెన్స్

ఇంటీరియర్​ డెకరేటర్​ అండ్​ డిజైనింగ్​

డ్రాఫ్ట్స్​మెన్​ (సివిల్/మెకానికల్​)

మెకానిక్​ (మోటార్​ )

మెకానిక్​ (డీజిల్​ ఇంజిన్​)

మెకానిక్​ (ఎలక్ర్టానిక్స్​ & మెషిన్స్​​)

ఇన్​స్ర్టుమెంట్​ మెకానిక్​

మెషినిస్ట్​

ఎలక్ర్టీషియన్​

టర్నర్​

ఫిట్టర్​

వెల్డర్​ (పైప్​/ఫ్యాబ్రికేషన్/గ్యాస్​)

వైర్​మెన్​

కంప్యూటర్​ హార్డ్​వేర్​ & నెట్​వర్కింగ్​

టూల్​ అండ్​ డై మేకర్​

ల్యాబ్​ అసిస్టెంట్​ (కెమికల్​)

షీట్​ మెటల్​ వర్కర్​

నాన్ ఇంజినీరింగ్

కంప్యూటర్​ ఆపరేటర్​ & ప్రోగ్రామింగ్

ఫైర్​మెన్​/ ఫైర్​ టెక్నాలజీ

హార్టికల్చర్​

ల్యాబోరేటరీ అసిస్టెంట్​

డెస్క్​టాప్​ పబ్లిషింగ్​

డేటా ఎంట్రీ ఆపరేటర్

స్టెనోగ్రాఫర్​/సెక్రెటేరియల్​ అసిస్టెంట్​​

ప్లంబర్​, కార్పెంటర్​

ఫుట్‌వేర్​ మేకర్​

లెదర్​ గూడ్స్​ మేకర్​

మల్టీమీడియా & యానిమేషన్​

ఫ్యాషన్​ డిజైనింగ్​

డెంటల్​ ల్యాబోరేటరీ టెక్నీషియన్​

క్యాటరింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్​

హెల్త్​ శానిటరీ ఇన్​స్పెక్టర్​

బ్యుటీషియన్​

ఫోటోగ్రాఫర్

వెబ్​ డిజైనింగ్​ & కంప్యూటర్​ గ్రాఫిక్స్​

వెలుగు ఎడ్యుకేషన్డెస్క్

Latest Updates