కరోనాతో మరణిస్తే ప్రభుత్వ ఉద్యోగం: మమతా బెనర్జీ

కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. దీంతో చాలా మంది ఉద్యోగులు పనులు చేసేందుకు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో  పశ్చిమ బెంగాల్  ప్రభుత్వ ఉద్యోగులకు మమతా బెనర్జీ  కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. బుధవారం(జులై-15) అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ నిర్ణయాన్ని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దీంతో వారు ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు భయపడిపోతున్నారు. వారి కుటుంబాల్లో భరోసా నింపడానికి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

 

Latest Updates