కరోనా కర్రీ, ఫేస్ మాస్క్‌ నాన్.. ఆకట్టుకుంటున్న జోధ్‌పూర్ డిషెస్

న్యూఢిల్లీ: కరోనా వల్ల అనేక రంగాల పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిల్లో ఆతిథ్య రంగం కూడా ఉంది. అయినా ఈ రంగంలో ఉన్న చెఫ్‌లు తమ క్రియేటివిటీని పెంచుకోవడం మాత్రం మానలేదు. ఎక్కడ చూసినా కరోనా కరోనా పదమే వినిపిస్తుండటంతో చెఫ్‌లు తమ వంటల్లో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా స్పెషల్ డిషెస్‌ చేస్తూ కస్టమర్స్ నోరూరిస్తున్నారు. మహమ్మారిపై పోరులో ఉపయోగపడే ఫుడ్ ఐటమ్స్‌ను కరోనా థీమ్‌తో రూపొందిస్తున్నారు. కరెంట్ ట్రెండ్స్‌ను పట్టుకునేలా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కరోనా స్పెషల్ కర్రీ, మాస్క్‌ నాన్స్‌ను తయారు చేసింది.

Posted by Vedic Multi cuisine Restaurant on Friday, July 31, 2020

జోధ్‌పూర్‌‌లో వేదిక్ అనే మల్టీ కజిన్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఇతర రెస్టారెంట్‌లలాగే వేదిక్ బిజెనెస్ కూడా పడిపోయింది. దీంతో ఏదైనా కొత్త ఐడియాతో ముందుకు రావాలని ఈ రెస్టారెంట్ నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా జోధ్‌పురి ఫేమస్ అయిన మలాయి కోఫ్తా కర్రీని కరోనా కర్రీగా తయారు చేశారు. ఇందులో ఖోయాలను కరోనా బాల్స్‌గా రూపొందించారు. అలాగే నాన్స్‌ను ఫేస్ మాస్కులుగా తయారు చేశారు.

‘మహమ్మారి చెలరేగుతున్న ఈ టైమ్‌లో ప్రజలు బయట తినడానికి భయపడుతున్నారు. వాళ్లు తమ ఇళ్ల నుంచి బయటికి వస్తున్నా రెస్టారెంట్ బిజినెస్ మాత్రం పెద్దగా పుంజుకోలేదు. రెస్టారెంట్స్‌లో ఎక్కువగా కస్టమర్స్ రావడం లేదు. దీంతో ప్రజలు మా రెస్టారెంట్‌కు వచ్చేలా ఏదైనా ఆసక్తికరంగా చేయాలని భావించాం. ఈ ఐడియా సక్సెస్ అయింది. స్పెషల్ డిషెస్‌ను రూపొందించాం’ అని వేదిక్ ఓనర్ అనిల్ కుమార్ తెలిపారు.

Latest Updates