టాప్ 10 టూరిస్ట్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌లో జోధ్ పూర్

బ్లూ సిటీ, సన్ సిటీ, గేట్ వే టు థార్.. రాజస్థాన్‌‌‌‌లోని జోధ్‌‌‌‌పూర్ సిటీకి ఉన్న మారుపేర్లు ఇవి. మెహ్రాన్‌‌‌‌గఢ్ కోట, నీలిరంగు ఇండ్లు, గుళ్ల వంటి కట్టడాలతో పాటు రుచికరమైన స్వీట్లు, స్నాక్స్, షాపింగ్ చేసుకునేందుకు విశాలమైన వీధులు, రకరకాల వస్తువుల వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో ఈ నగరం ఇప్పుడు అంతర్జాతీయ టూరిస్టులను బాగా ఆకర్షిస్తోందట. ఎక్కువ మంది విదేశీయులు ఇండియాలో చూసేందుకు ఎంచుకునే మొదటి ప్లేస్ తాజ్ మహల్ అని అందరూ అనుకుంటారు. అక్కడ విదేశీయుల రద్దీ కూడా అలాగే ఉంటుంది. ట్రావెల్‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌ చూసే బుకింగ్.కామ్ (booking.com) అనే వెబ్‌‌‌‌సైట్ గ్లోబల్ టూరిస్టుల బుకింగ్స్ ట్రెండ్స్ పై ఇటీవల సర్వే చేసింది. ఎక్కువ మంది టూరిస్టులు ఇండియా టూరిస్ట్ ప్లేస్‌‌‌‌లలో జోధ్ పూర్‌‌‌‌కే జై అన్నట్టు ఆ సర్వేలో తేలింది. ‘టాప్ 10 ఎమర్జింగ్ ట్రావెల్ డెస్టినేషన్స్ ఫర్ 2020’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో జోధ్‌‌‌‌పూర్ ప్రపంచంలో 10వ స్థానంలో నిలిచింది. చెక్కుచెదరని నేచురల్ బ్యూటీ ఉండే ఈ నగరాలకొచ్చేవాళ్లు కచ్చితంగా కొత్త కొత్త అనుభవాలను మూటగట్టుకెళ్లవచ్చని, అందుకే వీటికి ఆకర్షణ పెరిగిందని బుకింగ్.కామ్ నిర్వాహకులు పేర్కొన్నారు.

టాప్ 10 ట్రావెల్ డెస్టినేషన్స్ ఇవే..

  1. జీరా (రిపబ్లిక్ ఆఫ్​మాల్తా), 2. నిన్ బిన్ (వియత్నాం), 3. సాల్తా (అర్జెంటినా), 4. సియోగ్విపో (సౌత్ కొరియా), 5. స్వినౌజీస్ (పోలండ్), 6. తకమత్సు (జపాన్), 7. శాన్ జువాన్ (ప్యూర్టారికో), 8. జబుల్జక్ (మోంటెనీగ్రో), 9. యెరెవాన్ (ఆర్మేనియా), 10. జోధ్ పూర్ (ఇండియా).

Latest Updates