బిడెన్ ‘డిజిటల్ చీఫ్’మేధా రాజ్

ఇండియన్ అమెరికన్ కీలక పాత్ర
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డెమొక్రటిక్ క్యాండిడేట్ గా బరిలోకి దిగిన జో బిడెన్ టీమ్ లో ఇండియన్ అమెరికన్ మేధా రాజ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆమె బిడెన్ తరఫున క్యాంపెయిన్ కు డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఎంపికయ్యారు. కరోనా సంక్షోభం కారణంగా అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు పూర్తిగా వర్చువల్ పద్ధతిలోనే కొనసాగుతోంది. దీంతో బిడెన్ తరఫున మొత్తం డిజిటల్ ప్రచారం అంతా మేధా రాజ్ పర్యవేక్షణలోనే కొనసాగనుంది. మేధారాజ్ అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో గ్రాడ్యుయేషన్, స్టాన్ ఫర్డ్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం