పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కాలు విరగ్గొట్టుకున్న జో బిడెన్

తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుడు జో బిడెన్ గాయపడ్డారు. ఆయన శనివారం తన పెంపుడు కుక్కలలో ఒకటైన మేజర్‌తో ఆడుకుంటుండగా.. బిడెన్ కుడి కాలు పాదం విరిగింది. ఆదివారం కాలు నొప్పిగా ఉండటంతో డెలావేర్‌లోని ఆర్థోపెడిక్ డాక్టరు వద్దకు వెళ్లారు. అక్కడ ఎక్స్‌రే తీయగా ఎటువంటి గాయాలు కనిపించలేదు. దాంతో CT స్కాన్ చేశారు. అందులో బిడెన్ కుడి పాదం మధ్యలో రెండు చిన్న పగుళ్లు కనిపించాయని ఆర్థోపెడిక్ డాక్టర్ తెలిపారు. బిడెన్ కొన్ని వారాల పాటు వాకింగ్ బూట్ ధరించాలని డాక్టర్ సూచించారు.

బిడెన్ తన రెండు కుక్కలలో ఒకటైన మేజర్‌ను 2018లో దత్తత తీసుకున్నాడు. అంతకుముందు మొదటి పెంపుడు కుక్క చాంప్‌ను 2008 ఎన్నికల తర్వాత దత్తత తీసుకున్నాడు. 78 ఏళ్ల బిడెన్ జనవరి 20న అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా చరిత్రలోనే అతి ఎక్కువ వయసులో అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

For More News..

శివసేనలోకి ఊర్మిళ మటోండ్కర్.. వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం!

వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్‌పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా

నీ డీజీపీ ఆఫీసుకొస్తా బిడ్డా.. గెలిచే దమ్ములేక దాడి చేస్తున్నరు

Latest Updates