డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వోలో మళ్లీ చేరుతం

ఆ సంస్థలో రీఫార్మ్స్ చేపట్టాలి.. అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్ ప్రకటన

రూల్స్ ప్రకారం చైనా నడుచుకోవాల్సిందే

పారిస్ ఒప్పందంలోనూ తిరిగి చేరుతమని వెల్లడి

జార్జియాలో రీకౌంటింగ్​లో బైడెన్ గెలుపు

వాషింగ్టన్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్​(డబ్ల్యూహెచ్ఓ)లో మళ్లీ చేరుతామని అమెరికాకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. డ్రాగన్ దేశం చైనా డబ్ల్యూహెచ్ఓ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిందేనని కామెంట్ చేశారు. డెలావేర్​లోని విల్మింగ్టన్​లోను తన సొంతూరులో గవర్నర్ల బృందంతో గురువారం (అక్కడి టైం ప్రకారం) జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

చైనాను శిక్షించడం విషయం కాదు..

చైనాను శిక్షించాలంటూ తన ప్రెసిడెన్షయల్ డిబేట్ల సందర్భంగా బైడెన్ అన్నారు. దీంతో డ్రాగన్ దేశంపై ఎకనమిక్ శాంక్షన్స్, టారిఫ్​లు విధిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇక్కడ చైనాను శిక్షించడం అనేది విషయం కాదు. రూల్స్ ప్రకారం నడుచుకోవాలని ఆ దేశం అర్థం చేసుకునేలా చూసుకోవడం ముఖ్యం. ఇది చాలా సింపుల్​ ప్రపోజల్” అని బదులిచ్చారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని నెలల కిందట అమెరికా బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో తాము డబ్ల్యూహెచ్ఓలో తిరిగి చేరుతామని బైడెన్ అన్నారు. ‘‘మేం అధికారం చేపట్టిన మొదటి రోజే డబ్ల్యూహెచ్ఓలో చేరుతాం. ఆ సంస్థలో రీఫార్మ్స్ చేపట్టాలి. అలాగే పారిస్ ఒప్పందంలో కూడా తిరిగి చేరుతాం. మిగతా ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నామనే విషయాన్ని మనం చాటిచెప్పాలి” అని కామెంట్ చేశారు.

జార్జియాలో మెజారిటీ తగ్గింది..

జార్జియాలో జరిగిన రీకౌంటింగ్​లో కూడా జో బైడెన్ విజయం సాధించారు. 1992 నుంచి రిపబ్లికన్లకు కంచుకోటలా ఉన్న ఈ రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సుమారు 50 లక్షల బ్యాలెట్ ఓట్లను ఎన్నికల సిబ్బంది చేతులతో కొన్ని రోజులపాటు రీకౌంట్ చేశారు. 12,284 ఓట్ల మెజారిటీతో బైడెన్ గెలిచారు. అయితే ఫస్ట్ జరిపిన కౌంటింగ్​లో 14 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. రీకౌంటింగ్​లో మెజారిటీ తగ్గింది. జార్జియా ఎన్నికల ఫలితాలపై శుక్రవారం (అక్కడి టైం ప్రకారం) సర్టిఫై చేయనున్నారు. అక్కడ మొత్తం 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇవి కూడా బైడెన్ ఖాతాలో చేరడంతో ఆయనకు వచ్చిన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 306కు పెరిగింది. ఇక ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.

బైడెన్ @ 78

అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం 78వ పడిలోకి అడుగుపెట్టారు. మరో రెండు నెలల్లో ఆయన ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా హిస్టరీలో అత్యంత పెద్ద వయసులో ప్రెసిడెంట్ అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటిదాకా రొనాల్డ్ రీగన్ ఆ ప్లేస్ లో ఉన్నారు. రీగన్ 77 ఏళ్ల 349 రోజుల వయసులో .. 1989లో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.

For More News..

టెక్నికల్​ స్టూడెంట్స్​కు.. జాబ్​ గ్యారంటీ కోర్సులు

ఇండియాకు గుడ్​ చాన్స్‌.. ఐపీఎల్‌‌లో ఆడిన ప్లేయర్లు మంచి రిథమ్‌‌లో ఉన్నారు

ఇండియన్​కు ‘బుకర్​’ జస్ట్​ మిస్

Latest Updates