మంత్రి పదవి రాలేదన్న బెంగతో నా భర్తకు హై బీపీ వచ్చింది: జోగు రమ

ఆదిలాబాద్ జిల్లా: జోగురామన్నకు మంత్రి పదవి వస్తుందని చాలా ఆశతో ఎదురు చూశామని ఆయన భార్య రమ ఆవేదనతో చెప్పారు. పార్టీకోసం కష్టపడ్డ వ్యక్తికి మంత్రి పదవి రాకపోవడంతో నిరాశ చెందామన్నారు. మంత్రి పదవి రాలేదన్న బెంగతో జోగురామన్నకు బీపీ ఎక్కువ కావడంతో చికిత్స పొందుతున్నారని చెప్పారామె. కార్యకర్తలు, అభిమానులకు ఏం చెప్పాలో అర్థంకాక, జోగురామన్న ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని జోగు రమ చెప్పారు.

నాన్నకి మంత్రి పదవి వస్తుందని చాలా ఆశతో ఎదురు చూశామని… మొదటి దఫాలో మంత్రి పదవి వచ్చి, రెండవసారి రాకపోవడం తీవ్ర బాధను కలిగించిందని ఆయన కుమారుడు జోగు ప్రేమిందర్ అన్నారు.