జాంటీ రోడ్స్ ట్వీట్ : ప్రపంచంలోనే రైనా బెస్ట్ ఫీల్డర్

భారత ఆల్ రౌండర్ సురేశ్ రైనాపై ప్రశంసలు గుప్పించాడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్, జాంటీ రోడ్స్. ఫీల్డింగ్ అనగానే జాంటీ రోడ్స్ గుర్తుకువస్తాడు. అతని ఫీల్డింగ్ విన్యాసాలు అలా ఉండేవి మరి. జాంటీ రోడ్స్ ఫీల్డింగ్‌ లో ఉన్నాడంటే… సాధ్యమైనంత వరకూ అతని వైపు ఆడకుండా ఉండేందుకే ప్రయత్నించేవాళ్లు బ్యాట్స్‌ మెన్లు. అలాంటి జాంటీ రోడ్స్‌ .. ప్రస్తుత ప్లేయర్లలో తనకు నచ్చిన టాప్ 5 ఫీల్డర్ల గురించి చెప్పాడు.

ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న వారిలో తన దృష్టిలో సురేశ్ రైనాయే బెస్ట్ ఫీల్డర్ అని తెలిపాడు. ఆ తర్వాతి స్థానాన్ని సౌతాఫ్రికా సెన్సేషనల్ స్టార్ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్‌ కు ఇచ్చాడు. ఇంగ్లండ్ క్రికెటర్ పాల్ కాలింగ్‌ వుడ్‌ మూడో స్థానంలో నిలవగా… సఫారీ క్రికెటర్ హర్షల్ గిబ్స్‌ నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌ రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ ఐదో స్థానంలో నిలిచారు. ఇండియా నుంచి రైనాకు మాత్రమే చోటు దక్కగా… ఆస్ట్రేలియా నుంచి ఒక్కరు, ఇంగ్లండ్ నుంచి ఒక్కరికీ తన లిస్టులో చోటు కల్పించాడు జాంటీ రోడ్స్.

Latest Updates