జూరాల ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి విడుదల

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు కు వరద క్రమంగా పెరుగుతోంది. డ్యాం 6 గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. నిన్న రాత్రి నుండి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించిన అధికారులు తొలుత రెండు గేట్లు ఎత్తారు. పెరుగుతున్న వరదకు అనుగుణంగా కొద్దిసేపటి క్రితం మరో నాలుగు గేట్లు మొత్తం 6 గేట్లు ఎత్తి నీటివిడుదల పెంచారు. వరద పెరగడం.. స్పిల్ వే గేట్లు ఎత్తడంతో విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభమైంది. మూడు యూనిట్లలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం జూరాలకు ఇన్ ఫ్లో 60 వేల క్యూసెక్కులు వస్తోంది. డ్యాం పూర్తిగా నిండిపోవడంతో.. నిల్వ చేసే అవకాశంలేక వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 59వేల380 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం నీట్టి 8.969 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి మట్టం: 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం: 318.180  మీటర్లు ఉంది.

జూరాల నుండి నెట్టెంపాడు 750 క్యూసెక్కులు, బీమా ఎత్తిపోత పథకానికి 1 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ కు  630 క్యూసెక్కులు, జూరాల ఎడమ ప్రధాన కాలువ కు 700 క్యూసెక్కులు, జూరాల కుడి ప్రధాన కాలువ 285 క్యూసెక్కులు, బీమా లింక్ కెనాల్ కు 800 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్ –II కు  750 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తున్నారు.

 

Latest Updates