జర్నలిస్ట్ ను కాల్చిచంపిన లిక్కర్ మాఫియా..

journalist-ashish-janwani-brother-murdered-by-liquor-mafia

లిక్కర్ మాఫియా చేతిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. సహనేర్ ప్రాంతంలో ఆశీష్ జన్వానీ అనే జర్నలిస్ట్ తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆదివారం అతని ఇంట్లోకి వెళ్లిన దుండగులు అశీష్ ను కాల్చిచంపారు. అక్కడే ఉన్న అతని సోదరుడైన అశుతోష్ ను కూడా హత్య చేశారు. మృతులు కుటుంబాలకు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ 5లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలువలేదు.

ఉత్తరప్రదేశ్ హత్యాప్రదేశ్ గా మారిందని ఆరోపించారు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ గా మార్చామని బీజేపీ చెబుతున్నారని అయితే వాస్తవంలో మాత్రం ప్రతీ రోజూ హత్యలే జరుగుతున్నాయని అన్నారు.

Latest Updates