చైనాకు ర‌హ‌స్యాలు చేర‌వేస్తున్న జ‌ర్న‌లిస్ట్ రాజీవ్ శర్మతో పాటు ఇద్దరి అరెస్ట్

ఢిల్లీ పోలీసులు రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టును గూఢచర్యం ఆరోపణలపై ఇటీవల అరెస్ట్ చేశారు. రాజీవ్ శర్మ జర్నలిస్టు ముసుగులో చైనా గూఢచారిగా వ్యవహరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. భారత రహస్యాలను చైనాకు చేరవేస్తున్న రాజీవ్ శర్మ అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బు పొందుతున్నట్టు భావిస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా అతడికి నగదు చెల్లింపులు జరుగుతున్నట్టు గుర్తించారు. రాజీవ్ శర్మకు చెల్లింపులు చేస్తున్న  ఓ మహిళను, నేపాలీ వ్యక్తిని కూడా ఢిల్లీ పోలీసులు ఇవాళ(శనివారం,సెప్టెంబర్-19)  అరెస్ట్ చేశారు.

రాజీవ్ శర్మను సెప్టెంబర్ 14న స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసి.. సెప్టెంబర్ 15 కోర్టులో హాజరుపరిచారు. అతడిని ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. సున్నితమైన సమాచారాన్ని అందించినందుకుగాను చైనా ఇంటెలిజెన్స్ విభాగం అతనికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందని డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ తెలిపారు. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకుడిగా మీడియా లో  రాజీవ్ శర్మకు గుర్తింపు ఉంది. అయితే అతను రక్షణ రంగానికి చెందిన కీలక పత్రాలు కలిగివున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు.

Latest Updates