అక్రిడేషన్ రద్దు పై జర్నలిస్టుల ధర్నా

కీసర లోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.. జర్నలిస్ట్ సంఘాల నాయకులు. తార్నకలోని HMDA కార్యాలయంను తరలిస్తున్నారన్నా వార్తాను రాయడంతో.. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి.. ఆ రిపోర్టర్ అక్రిడేషన్ రద్దు చేశారు. దీనిని నిరసిస్తూ.. జర్నలిస్టు సంఘం మేడ్చల్ కలెక్టరు ఆఫీసు ముందు దర్న నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల విషయంలో అధికారులు కక్ష్య సాదింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రిడేషన్ రద్దుకు జారి చేసిన సర్క్యూలర్ ను ఉపసంహరించుకోవలని డిమాండ్ చేశారు. లేకపోతే సెక్రటేరియట్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.. జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకుడు విరాత్. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు జర్నలిస్ట్ సంఘం నేతలు.

 

Latest Updates