జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్ కు జర్నీ 6 నిమిషాలు మాత్రమే

హైదరాబాద్ లో నిత్యమూ అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో జూబ్లీహిల్స్ నుంచి మైండ్  స్పేస్ కు వెల్లేదారి ఒకటి. మొత్తం 6.5 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో వెళ్లాలంట… కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఈ రహదారిలో గంటకు 30 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లే పరిస్థితి ఉండదు. అలాంటిది ఇప్పుడీ దూరం 2.5 కిలోమీటర్లకు దగ్గింది. జర్నీ టైం కూడా కేవలం 6 నిమిషాలే.

నిన్న(శుక్రవారం) రాత్రి దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి జాతికి అంకితమైంది. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఫ్లయ్ ఓవర్ ఎక్కితే, నేరుగా మైండ్ స్పేస్ వరకూ ఈజీగా వెళ్లే అవకాశం హైదరాబాదీలకు దగ్గరైంది. ఈ బ్రిడ్జ్ పై వారాంతంలో మాత్రం వాహనాలను అనుమతించబోమన్నారు అధికారులు. పర్యాటకుల కోసం తెరచి, ప్రత్యేక లైటింగ్ కార్యక్రమాలను చేపట్టి, టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Latest Updates