సభ్యత్వ నమోదులో జేపీ నడ్డా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ నేషనల్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనలో రెండో రోజైన సోమవారం పార్టీ నేతలతో కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌‌‌‌లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్  క్వార్టర్స్‌‌‌‌లో 8 మందికి పార్టీ సభ్యత్వ నమోదు రశీదులను అందజేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సభ్యత్వ రశీదులను అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌‌‌‌రావు, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, పార్టీ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పాల్గొన్నారు.

అంబేద్కర్ కాలేజీలో మొక్క నాటిన నడ్డా

హైదరాబాద్ బాగ్‌‌‌‌లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో సోమవారం ఉదయం జేపీ నడ్డా మొక్క నాటారు. ఆయన వెంట వచ్చిన బీజేపీ సీనియర్ లీడర్లు మురళీధర్ రావు, లక్ష్మణ్, దత్తాత్రేయ, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ రాంచందర్‌‌‌‌రావులూ మొక్కలు నాటారు. అంబేద్కర్ కాలేజీలో నడ్డాకు ఆ కాలేజీ విద్యార్థులు, ఎన్‌‌‌‌సీసీ క్యాడెట్లు ఘనంగా స్వాగతం పలికారు. మొక్కలు నాటిన అనంతరం బీజేపీ నాయకులు కాలేజీ ఆవరణలో గంటపాటు గడిపారు. డా.బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల గవర్నింగ్ బాడీ మెంబర్ శ్రీమతి జి. సరోజ వివేకానంద్ కార్యక్రమ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. బీజేపీ నేతలు కాసిపేట లింగయ్య, ఆకుల విజయ,   నేతలు, కార్యకర్తలతోపాటు ప్రముఖ మెజీషియన్ సామల వేణు పాల్గొన్నారు.

Latest Updates