బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఇవాళ(సోమవారం) ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. 12.30 నుంచి 1.30 గంటల వరకు నామినేషన్లు పరిశీలించారు. తర్వాత జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. జేపీ నడ్డాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు.

బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌సింగ్‌ నియామకపత్రాన్ని అందించారు. ఇవాళ సాయంత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు,డిప్యూటీ సీఎంలతో కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నడ్డా వ్యవహరించారు.

Latest Updates