నారాలోకేష్ ను ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు

ఏపీ మాజీ మంత్రి నారాలోకేష్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. టీడీపీ  అధికారంలో ఉన్నప్పుడు లోకేష్  పలుమార్లు నోరు జారీ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. తాజాగా సైరా సినిమాపై స్పందించి  జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్నిఅగ్రహానికి గురిచేస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి  బాక్స్ ఫీస్ ను షేక్ చేస్తుంది. రికార్డ్ ల కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా  నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఆహార్యం, నటన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నేటి హీరోలకు ధీటుగా అదరగొట్టడంతో విమర్శకుల సైతం ప్రశంసలు అందించారు. అయితే సైరా సినిమాపై నారాలోకేష్ తనదైన శైలిలో స్పందించారు.

తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు. అంటూ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ రంగ స్థలం, చిరంజీవి సైరానరసింహారెడ్డి సినిమాలు బాగున్నాయని ట్వీట్ చేసి తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ సినిమాలపై స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే లోకేష్ కి భయం పట్టుకుంది. ఎక్కడ టీడీపీ అధినేత అవుతాడేమోనని. అందుకే ఎన్టీఆర్ సినిమాలపై స్పందిచండం లేదని విమర్శిస్తున్నారు.

 

 

 

Latest Updates