అభిమానులకు జూ. ఎన్టీఆర్ లేఖ

బాల రామాయణం సినిమా ద్వారా బాలనటుడిగా తెరంగేట్రం చేసిన యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్.. ఆ తర్వాత స్టూడెంట్ నెం 1 తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తన నటనతో మరెన్నో సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన పుట్టినరోజు మరో రెండు రోజుల్లో రానుంది. అంటే మే 20న ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, లాక్డౌన్ వల్ల అది కుదరలేదు. దాంతో తన అభిమానులు ఎక్కడ నిరాశకు లోనవుతారోనని భావించిన ఎన్టీఆర్.. అభిమానులను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.

‘ఈ కరోనా విపత్తు సమయంలో నా అభిమానులందరూ ఇంటి వద్దే ఉంటూ.. క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ప్రతి ఏటా నా పుట్టినరోజు మీరు చూపించే ప్రేమ, మీరు చేసే కార్యక్రమాలు నాకు ఎంతో ఆశీర్వచనాన్ని ఇస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం మీరు వాటన్నింటికి దూరంగా ఉండాలి. లాక్డౌన్ నియమాలను పాటిస్తూ.. కరోనా నియంత్రణకు పాటుపడాలి. అదే మీరు నాకిచ్చే విలువైన బహుమతి.

అలాగే నేను నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’సినిమా నుంచి ఎటువంటి ఫస్ట్ లుక్ కానీ, టీజర్ కానీ విడుదల చేయడం లేదు. ఈ విషయం మిమ్మల్ని ఎంతగానో నిరాశకు లోనుచేస్తుంది. కానీ తప్పడం లేదు. మేం ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి చాలా ప్రయత్నించాం. లాక్డౌన్ వల్ల చిత్రపరిశ్రమకూడా ఆగిపోయిందని మీ అందరికి తెలుసు. రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని నమ్ముతున్నాను’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

For More News..

సోదరునితో అక్రమసంబంధం అంటగట్టిన పోలీసులు

తెలంగాణలో రేపటి నుంచి బస్సు సర్వీసులు!

స్టాక్ మార్కెట్ నష్టాలతో గవర్నమెంట్ టీచర్ సూసైడ్

Latest Updates