జెర్సీపై ఎన్టీఆర్ ట్వీట్ : బాల్ బౌండరీలు దాటింది

నాని హీరోగా నటించిన జెర్సీ శుక్రవారం రిలీజ్ కాగా..ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సినీస్టార్స్ నానికి విషెస్ తెలుపుతున్నారు. జెర్సీ చూసిన హీరో ఎన్టీఆర్ ట్విట్టర్ లో నానిపై ప్రశంసలు గుప్పించాడు.  ‘జెర్సీ’ సినిమాను ఉద్దేశిస్తూ ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశాడు.  ‘Bro నాని.. నీ అద్భుతమైన ఫర్మామెన్స్ తో బాల్ బౌండరీలు దాటింది. అద్భుతం, అద్భుతం, అద్భుతం.

ఈ సినిమాలో నీ యాక్టింగ్ ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నన్ను రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ ఎక్కించింది. ఇంతటి అద్భుతమైన స్టోరీ రాసుకుని, చక్కగా తెరకెక్కించినందుకు డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరికి హ్యాట్సాఫ్‌. గౌతమ్‌ విజన్‌ ను అర్థంచేసుకుని, ఆయనకు మద్దతిచ్చినందుకు సినిమా యూనిట్ కి అభినందనలు’ అని ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో నాని సరసన  శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్ నటించింది.

Latest Updates