పులితో తారక్ రియల్ ఫైట్..?

‘పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూసుకో. పులితో ఫొటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చెయ్. అదే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’.. ‘యమదొంగ’ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండిపోయింది. అప్పుడు డైలాగ్ మాత్రమే చెప్పాడు కానీ ఇప్పుడు నిజంగానే పులితో ఆటాడుతున్నాడు తారక్. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న తారక్.. ఓ సీన్‌‌లో నిజమైన పులితో ఫైట్ చేస్తున్నాడట. ఇందులో తారక్ కొమరం భీమ్‌‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ సందర్భంలో పులితో తలపడాల్సి వస్తుందట. దాదాపు ఐదు నిమిషాలకు పైగా సాగే ఈ పోరులో నువ్వా నేనా అనే రీతిలో ఎన్టీఆర్ పులితో పోరాడతాడట. గ్రాఫిక్స్ ‌తో తీసే అవకాశం ఉన్నా కూడా నేచురాలిటీ కోసం నిజం పులితో ప్లాన్ చేశారట. ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఆ సీన్లను తెరకెక్కించారట. ఇది సినిమాకి హైలైట్‌‌గా నిలవడం ఖాయమంటున్నారు. ఆల్రెడీ ఈ సీన్‌‌కి సంబంధించిన లీకులు బైటికొచ్చాయి. దాంతో అభిమానుల  అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిన ఈ మూవీ త్వరలోనే తిరిగి పట్టాలెక్కనుంది.

 

Latest Updates