వైకుంఠపురం తర్వాత ‘హస్తిన’..

‘అల వైకుంఠపురంలో’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నారు.  ఆ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అరవింద సమేత వీర రాఘవ , అల వైకుంఠపురంలో.. ఇలా వరుస హిట్ లు కొట్టిన మాటల మాంత్రికుడు తన తర్వాతి సినిమాకి కూడా ‘అ’ అనే అక్షరంతో టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. అదే ‘అయినను పోయిరావలె… హస్తినకు’ .

పూర్తి స్థాయి వినోద భరితంగా ఈ సినిమాని తెరకేక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నందమూరి హీరో(జూ.ఎన్టీఆర్) .. ఈ ఏడాది మే తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయనున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్, హారిక హాసిని క్రియేషన్స్ పై కే రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ , తివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Jr NTR , Trivikram Srinivas's next movie title