శాకాంబరీ అమ్మవారిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ

జూబ్లీహిల్స్  పెద్దమ్మ ఆలయంలో  శాకాంబరి  ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  కూరగాయలు, పళ్లు,  పూలతో  శాకాంబరిగా  కొలువైన అమ్మవారిని  దర్శించుకునేందుకు  భక్తులు పెద్దసంఖ్యలో  వస్తున్నారు. ఏటా ఆషాడమాసంలో  అమ్మవారికి  శాకాంబరి ఉత్సవాలు  నిర్వహించడం ఆనవాయితీగా  వస్తోంది.  మొదటి రోజు ఎదరుకోళ్లతో ఉత్సవాలు మొదలయ్యాయి. నిన్న అమ్మవారి కళ్యాణం జరుగగా… ఈ రోజు రథోత్సవం జరుగనుంది. అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందులో భాగంగా.. ఈ రోజు కొందరు భక్తులు అమ్మవారికి  బోనాలు సమర్పించారు.