కరెంట్ షాక్ తో జడ్జి మృతి

కర్నూలు జిల్లా : ఆదోని మండలం విరుపాపురం గ్రామంలో విషాదం  చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి జడ్జి దేవదాసు(43) మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న ఇంటికి క్యూరింగ్ చేసేందుకు మోటార్  స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలడంతో జడ్జి అక్కడే కుప్పకూలాడు.

గమనించిన స్థానికులు వెంటనే ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే  ఆయన చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు డాక్టర్లు. న్యాయమూర్తి దేవదాసు పత్తికొండ సెకండ్ క్లాస్ కోర్టులో మెజిస్ట్రేట్ గా పనిచేసేవారు.

Latest Updates