JKLF చీఫ్‌ యాసిన్ మాలిక్‌ కు జ్యుడీషియల్ కస్టడీ

జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (JKLF) చీఫ్‌ యాసిన్ మాలిక్‌ను వచ్చేనెల 24 వరకు జ్యుడీషియల్ కష్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని పటియాలా కోర్టు నిర్ణయం తీసుకుంది. 2017లో ఆయనపై దాఖలైన ఉగ్రవాదులకు నిధులు చేరవేరుస్తున్నారన్న కేసులో కోర్టు ఈ నిర్ణయించింది. మరోవైపు మాలిక్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు అనుమతించాలంటూ తీహార్ జైలు అధికారులు పటియాలా కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం… దీనిపై స్పందన తెలియజేయాలంటూ మాలిక్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 10న యాసిన్ మాలిక్‌ను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) 22 వరకు తమ కస్టడీలో ఉంచి విచారించింది. JKLF పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన రెండు వారాల్లోనే NIA ఈ మాజీ మిలిటెంట్ నాయకుడిని అరెస్ట్ చేసింది. యాసిన్ మాలిక్‌ పై రెండు సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.

Latest Updates