రెండో అంతస్తు నుండి దూకి.. ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య

ఏపీ క్యాడర్ కు చెందిన వి.బి భాస్కర్

ఏ సమస్యలూ లేవంటున్న కుటుంబ సభ్యులు

హైదరాబాద్: ఎల్బీ నగర్ నాగోల్ లో ఏపీ ఐఎఫ్ఎస్ (IFS)  అధికారి వి.బి భాస్కర్ రమణ (59) ఆత్మహత్య చేసుకున్నాడు. బండ్లగూడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి బిల్డింగ్ రెండవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. గత మూడు నెలలుగా సెలవులో ఉన్న ఆయన గత 10రోజులుగా డిప్రెషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆంద్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. భాస్కర్ రమణకు చిన్న చిన్న ఆఫీస్ సమస్యలు తప్ప  ఆర్ధిక ఇబ్బందులు కానీ కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు అతని దగ్గరి మిత్రుడు డాక్టర్ రాజా తెలిపారు. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉండగా పెద్ద కూతురు వివాహం జరిగి బెంగుళూరులో ఉండగా రెండవ కూతురు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ రిత్యా బెంగుళూరుకు వెళ్లి గత కొద్ది రోజుల క్రితమే తిరిగి వచ్చింది.

Latest Updates