రూ.3000 లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన జూనియర్ ఆడిటర్

Junior auditor caught by ACB demanding a bribe of Rs.3000

ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ దగ్గర రూ.3000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు జూనియర్ ఆడిటర్. నగరంలోని అబిడ్స్ లో ఉన్న  స్టేట్ ఆడిట్ కార్యాలయంలో  అవినీతి అధికారులు దాడులు  నిర్వహించారు.

రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అయిన ముజహీద్ హుస్సేన్ యొక్క పెన్షన్ డబ్బులు ప్రాసెస్ చేయడానికి రూ. 3000 డిమాండ్ చేసిన జూనియర్ ఆడిటర్ మహమ్మద్ జైనులాబద్దీన్. దీంతో హుస్సేన్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ప్లాన్ ప్రకారం..  హుస్సేన్ తరఫున  కుసులంపురా పీఎస్ హెడ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్..  జైనులాబద్దీన్ ఆ డబ్బును ఇస్తానని చెప్పాడు.  అజయ్ కుమార్ నుంచి జైనులాబద్దీన్ ఆ లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

Junior auditor caught by ACB demanding a bribe of Rs.3000

Latest Updates