త్వరలో జూ. క్రికెట్‌ చాంపియన్‌షిప్

ఇండియాలో తొలి క్లబ్‌ క్రికెట్ ‌ప్లాట్‌‌ఫామ్‌‌
మెంటార్లుగా చేతన్‌‌ శర్మ, అశోక్‌ మల్హోత్ర, సునీల్ బాబు
హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలోని యువ ప్రతిభావంతులను వెలికి తీసి.. నాణ్యమైన శిక్షణ ఇచ్చి వారిని ఇంటర్నేషనల్ ‌‌లెవెల్ ‌‌క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఓ ఇంటిగ్రేటెడ్ క్రికెట్‌ ప్లాట్ ఫామ్ రెడీ అయింది. స్కూల్‌ స్టూడెంట్స్‌‌, యూత్‌ను ఎంకరేజ్ ‌‌చేసేందుకు జూనియర్ క్రికెట్‌ చాంపియన్‌‌షిప్‌‌(జేసీసీ) ఏర్పాటైంది. లండన్‌‌కు చెందిన సెవెన్‌‌3 స్పోర్ట్స్ కంపెనీ ఇండియాలో తొలిసారి ఈ ‘క్ల‌బ్‌ క్రికెట్‌‌’ను ప్రవేశపెట్టబోతోంది. ఇంగ్లండ్‌‌ , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ‌ల్లోని క్ల‌బ్‌ క్రికెట్ ‌‌మోడల్‌‌ను అమలు చేయనుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 8 నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న యంగ్‌ టాలెంట్‌‌ను గుర్తించి, నేషనల్‌‌, ఇంటర్నేషనల్ ‌‌లెవెల్ ‌‌కోచ్‌లతో ట్రెయినింగ్‌‌(ఆన్‌‌లైన్‌ కూడా) ఇస్తారు.

అనంతరం ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసే క్లబ్స్‌‌లో వారిని చేర్చి.. వివిధ దశల్లో జరిగే జేసీసీలో ఆడిస్తారు. దేశవ్యాప్తంగా 65 టాప్‌‌సిటీలకు కలిపి వంద క్లబ్స్‌‌ను ఏర్పాటు చేస్తారు. ఈ క్ల‌బ్‌ క్రికెట్‌‌ను పర్యవేక్షించేందుకు పలువురిని మెంటార్లుగా నియమించారు. మాజీ క్రికెటర్ చేతన్‌‌శర్మ సెంట్రల్ ‌‌జోన్ ‌‌మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. సౌత్‌ జోన్ ‌‌మెంటార్ గా క్రికెట్ ‌‌అసోసియేషన్ ‌‌ఆఫ్ తెలంగాణ ఫౌండర్ సెక్రటరీ కె. సునీల్‌‌బాబు నియమితులయ్యారు. ఇండియా మాజీ ఆటగాళ్లు అశోక్‌ మల్హోత్రా, సురీందర్ ఖన్నా ఇతర జోన్లను పర్యవేక్షిస్తారు. ఈ క్లబ్ క్రికెట్ తో ఇండియన్ ‌క్రికెట్ కు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సునీల్‌ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసక్తి ఉన్నవారు(8నుంచి 18 ఏళ్లు) https://jcc-india.com/register/register-discount.php లింక్‌‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని,ఇతర వివరాలకు https://jcc-india.comసైట్‌‌ను చూడాలని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates