గాంధీలో డాక్టర్​పై దాడి..ఆందోళనకు దిగిన జూడాలు

పద్మారావునగర్, వెలుగు:  గాంధీ హాస్పిటల్లో మరోసారి ఓ డాక్టర్​పై దాడి జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ వ్యక్తి చనిపోయాడని ఆగ్రహిస్తూ ఓ కరోనా పేషెంట్ (70 ఏళ్ల వ్యక్తి) బంధువులు మండిపడ్డారు. పోలీసు సెక్యూరిటీ లేకపోవడంతో నేరుగా హాస్పిటల్​ మూడో ఫ్లోర్​లోని ఐసీయూలోకి వెళ్లారు. అక్కడ ఓ పీజీ డాక్టర్​పై కుర్చీతో దాడి చేశారు. దీనిపై డాక్టర్లు, హెల్త్​ స్టాఫ్​ అంతా భయాందోళనకు గురయ్యారు. కాసేపటికే తమకు భద్రత కల్పించాలంటూ జూనియర్​ డాక్టర్లు గాంధీ హాస్పిటల్​ ఆవరణలో ఆందోళనకు దిగారు. 65 బెడ్లు ఉండాల్సిన ఐసీయూను వందల బెడ్లకు పెంచారని.. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్న డాక్టర్లపై దాడులు జరగడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు భద్రత లేదని, పోలీసు సెక్యూరిటీ లేదని.. ఇట్లా అయితే డ్యూటీ చేయలేమని వాపోయారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసు ఉన్నతాధికారులు గాంధీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రత పెంచుతామని, నిందితులపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయినా జూనియర్​ డాక్టర్లు శాంతించలేదు. అర్ధరాత్రి దాటినా ఆందోళన కొనసాగుతూనే ఉంది.

డెడ్ బాడీలకు టెస్టులు చేయలేం

Latest Updates