జూరాలకు తగ్గిన వరద.. గేట్లు క్లోజ్.. 7 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో

జూరాలకు తగ్గిన వరద.. గేట్లు క్లోజ్.. 7 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో

గద్వాల, వెలుగు:  కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌‌‌‌ల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ వద్ద అన్ని గేట్లను ఆదివారం అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 57 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండగా, జూరాల హైడల్ ప్రాజెక్ట్‌‌‌‌లోని ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం 44,279 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ మొత్తం 48,123 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 4.824 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తిని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు జెన్‌‌‌‌కో అధికారులు తెలిపారు.