పోలింగ్ కు ముందు: కనిమొళి ఇంట్లో IT సోదాలు

పోలింగ్​ జరగడానికి కొద్ది గంటల ముందు ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేతల ఇండ్లపై ఆదాయ పన్ను శాఖ దాడులు తమిళనాడులో సంచలనంగా మారింది.తూత్తుకుడి లోక్​సభ డీఎంకే అభ్యర్థి కనిమొళి నివాసంలో మంగళవారం రాత్రి ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఎన్ని కల సంఘం ఫ్లయింగ్​ స్క్వాడ్​తో కలిసి తూత్తుకుడిలోని కనిమొళి ఇంటికి చేరుకున్న 10మంది అధికారుల బృందం, దాదాపు మూడు గంటలపాటు సెర్చ్​ చేశారు. ఐటీ దాడుల సమాచారం తెలిసి వెంటనే పెద్ద సంఖ్యలో పోగైన డీఎంకే కార్యకర్తలు, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదా లు చేస్తూ కనిమొళి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు టీవీవీ దినకరన్​కు చెందిన అమ్మ మక్కల్​ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) పార్టీపై నా ఐటీ, ఈసీ వలపన్నాయి. థెని జిల్లా ఆదిపట్టిలోని పార్టీ కార్యాలయం నుంచి రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచడానికే ఈ డబ్బు లు సిద్ధం చేసినట్లు, మొత్తం ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు ఈసీ ప్రకటించిం ది. తమిళనాడు లోని 38 లోక్​సభ స్థానా లతోపాటు 18 అసెంబ్లీ సీట్లలో మంగళవారంతో ప్రచారం ముగిసింది. ఇక్కడ గురువారం పోలింగ్ జరగనుండగా ఐటీ దాడుల వ్యవహారం రచ్చకు దారితీసింది.

ఆమె ఇంట్లో వందలకోట్లున్నాయ్ : స్టాలిన్

తూత్తుకుడి డీఎంకే అభ్యర్థి కనిమొళి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేయడాన్ని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​ తప్పు పట్టారు. ప్రధాని మోడీ ఆదేశాల ప్రకారమే ప్రత్యర్థుల ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని, పరిస్థితిని అదుపుచేయాల్సిన ఎన్నికల సంఘం చేతులు ముడుచుకొని కూర్చోవడం దారుణమని స్టాలిన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘మా అభ్యర్థి(కనిమొళి)నే టార్గెంట్​ చేయడమెందుకు? బీజేపీ క్యాండేట్​ తమిళిసాయి సౌందరరాజన్(తమిళనాడు బీజే పీ చీఫ్​) ఇంట్లో వందల కోట్ల నోట్ల కట్టలున్నాయి. అయినా సరే ఐటీ అధికారులు అటువైపు వెళ్లడంలేదు. సరిగ్గా పోలింగ్​కి ముందు ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడానికి కేంద్రం ప్రయత్నిస్తు న్నది. ఈసీ తక్షణమే కలుగజేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి’అని స్టాలిన్​ అన్నారు.

Latest Updates