‘దిశ’ ఘటనపై పార్లమెంట్ లో గళమెత్తిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు

justice-for-disha-congress-mps-protests-in-parliament

రేపిస్టులను కొట్టి చంపాలి..బహిరంగంగా ఉరితీయాలి..సానుభూతి కాదు.. సత్వర న్యాయం కావాలి..నేరం చేయాలంటే .. వణికేలా చట్టాలు తేవాలి. ఇవి సామాన్యు లు చేసిన డిమాండ్లు కావు. పార్లమెంట్ సభ్యులు చేసిన డిమాండ్లు. వెటర్నరీ డాక్టర్​ ‘దిశ’ అత్యాచారం, హత్య వారిని కదిలించింది. పార్లమెంట్ వేదికగా,పార్టీలకు అతీతంగా సభ్యులంతా సోమవారం గళమెత్తా రు. దారుణాన్ని ఏకకంఠంతో ఖండించారు. ఆ రేపిస్టులను వెంటనే ఉరితీస్తే మరో సంఘటన జరగకుండా ఉంటుందని అన్నారు. ఇప్పుడున్న చట్టాలు సరిపోవని, వాటిని మార్చాల్సిందేనని పట్టుబట్టారు. దేశం తలదించుకునే ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్నాళ్లని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళా ఎంపీలు కన్నీళ్లు పెట్టుకు న్నారు. ‘నిర్భయ’ కేసులో దోషులకు ఇప్పటికీ శిక్ష అమలు కాలేదని, దిశ కేసులోనూ అలాంటి పరిస్థితి రావొద్దన్నారు. సభ్యుల సూచనలను ఆహ్వానిస్తున్నామని, చట్టాల్లో సవరణలకు సిద్ధమని కేంద్రంప్రకటించింది. 

మగతనం లేకుండా చేయాలి

మదంతో ఊగిపోయే పశువులకు, అత్యాచారాలు చేసే మనుషులకు పెద్ద తేడా ఉండదు. దోషులుగా తేలిన రేపిస్టులందరికీ పశువులకు చేసినట్లే మగతనం లేకుండా చేయాల్సిన అవసరముంది. క్యాస్ట్రేట్ లేదా​విత్తుకొట్టడంగా పిలిచే ఈ ప్రక్రియను అమలు చేసేందుకు కోర్టులు అనుమతించాలి.

– పుష్పనాథన్​ విల్సన్ డీఎంకే

వెటర్నరీ డాక్టర్​ ‘దిశ’ అత్యాచారం, హత్యను తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఖండించారు. మరో సంఘటన జరగకుండా కఠిన చట్టాలు తేవాలని, ఇలాంటి కేసుల్లో శిక్షలు వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. సోమవారం లోక్​సభలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు రేవంత్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, బండి సంజయ్​కుమార్, మాలోతు కవితతోపాటు ఏపీకి చెందిన ఎంపీలు వంగ గీత, రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్​నాయుడు మాట్లాడారు. కఠిన చట్టాలు తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి లోక్​సభ దృష్టికి తెచ్చారు.

పోలీసుల వైఫల్యమే: రేవంత్

దిశ ఘటనలో పోలీసుల వైఫల్యం కనిపి స్తోందని మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. నిందితులకు శిక్ష అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం జరుగు తోందని ప్రశ్నించారు. నిర్భయ ఘటన లో ఇలాంటి పరిస్థితే ఉందని తెలిపారు.

కొత్త చట్టాలు తేవాలి: బండ ప్రకాశ్

రోజూ ఏ న్యూస్​పేపర్​ చదవినా ‘దిశ’లాంటి ఘటనలు కనిపిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్​ అన్నారు. మిగితా సభ్యులు కోరు తున్నట్లు కొత్త చట్టాలు తేవాలి.

మహిళలను బతకనివ్వండి: వంగ గీత

దిశ ఘటనలో రాజకీయాలు చేయొద్దని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన చట్టాలు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగ గీత సూచించారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం చేయాలంటే భయపడాల్సిన చట్టాలు తేవాలన్నారు.

పోలీస్​ పెట్రోలింగ్​ పెంచాలి: కనకమేడల

దిశ ఘటన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసిందని  రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్​ అన్నారు. ఘటనకు ముందే పోలీస్​ పెట్రోలింగ్ పెంచితే బాగుండేది.

దోషులకు ఉరిశిక్ష పడాలి:  కవిత

దిశ హత్య ఘటన దేశాన్ని కలిచివేసిందని మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత అన్నారు. నిర్భయ కేసులో ఇప్పటివరకు దోషులకు ఉరిశిక్ష అమలు కాలేదని, దీంతో నేరస్తుల్లో భయం లేకుండా పోయిందని తెలిపారు. దోషులకు వెంటనే ఉరిశిక్ష పడేలా చట్టాలను సవరించాల్సిన అవ‌‌స‌‌రం
ఉందని అన్నారు.

వెంటనే శిక్షలు అమలు చేయాలి: సంజయ్

కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ..
దిశ ఘటనతో దేశమంతా కలత చెందిందన్నారు. సభ్య సమాజం తల దించుకోవాల్సిన దుర్ఘటన ఇది అని పేర్కొన్నారు. దోషులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే, ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు.

చట్టాలు కఠినంగా ఉండాలి: రామ్మోహన్

అత్యాచార కేసుల్లో దోషులకు కఠినశిక్షలు పడేలా సమర్థమైన చట్టాలు లేకపోవడం వల్లే ‘దిశ’ హత్యలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. నిర్భయ ఘటన తర్వాత కూడా అత్యాచారాలు ఆగడం లేదని, చట్టాలను మరింత కఠినంగా సవరించుకోవాల్సిన అవసరం స్పష్టంగా కన్పిస్తోందని అభిప్రాయపడ్డారు. మహిళ భద్రతపై స్కూల్​ స్థాయి నుంచే అవగాహన కల్పించాలన్నారు.

కఠిన చట్టాలు తెచ్చేందుకు  సిద్ధం: కిష‌‌న్ రెడ్డి

వెటర్నరీ డాక్టర్​పై జరిగిన దారుణాన్ని తలచుకుంటే ఎంతో బాధకలుగుతోందని లోక్​సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు చురుగ్గా పనిచేయాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

Latest Updates