దళిత బిడ్డకూ న్యాయం చేయండి

జైనూర్ బంద్‌కు పిలుపునిచ్చిన సంఘాలు

ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వెలుగు: దిశకు న్యాయం చేసినట్లుగానే ఆసిఫాబాద్‌లో మృతిచెందిన దళిత బిడ్డకూ న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు మరోసారి రోడ్డెక్కారు. దళిత మహిళ హత్యకు కారణమైన ముగ్గురు నిందితులను ఇంతకన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం జైనూర్ మండలం బంద్‌కు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దిశ కేసు తక్కువ సమయంలో ముగించినట్లుగానే ఆసిఫాబాద్ కేసులోనూ న్యాయం చేయాలని దళిత మహిళ భర్త కోరారు.

Latest Updates