ఏపీ SEC గా జస్టిస్ కనగరాజు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజు నియమితులయ్యారు. దీంతో ఇవాళ విజయవాడలో ఆయన భాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి సెక్షన్ 200 ని పూర్తిగా మర్చేస్తు ఆర్డీనెన్స్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం 5 ఏళ్ల నుంచి 3సంవత్సరాలకు కుదించబడింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో జస్టిస్‌ కనగరాజు పేరును ప్రతిపాదిస్తూ  గవర్నర్‌ ఆమోదానికి దస్త్రం పంపింది. దీంతో గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో జస్టిస్‌ కనగరాజు భాధ్యతలు చేపట్టారు.

Latest Updates