ఢిల్లీ : న్యాయమూర్తిని బదిలీ చేయడంతో రాజకీయ దుమారం

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్ మురళీధర్ ను  హర్యాణా హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో కావాలనే మురళీధర్ ను బదిలీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఆయన బదిలీ గురించి ఎస్సీ కొలిజియం ఇంతకు ముందే సిఫారసు చేసింది. ఇందుకు గాను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. తాము కావాలని బదిలీ చేయలేదని సుప్రీం కోర్టు కొలీజియన్ ఇచ్చిన సిఫారసు మేరకే మురళీధర్ జదిలీ అయ్యారని చెప్పారు.

న్యాయమూర్తి మురళీధర్ బదిలీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.  బీజేపీ నేతలను రక్షించేందుకే జడ్జీని బదిలీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జడ్జీని అర్ధరాత్రి బదిలీ చేయడమేంటనీ ప్రశ్నించారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. జడ్జీని బదిలీ చేశారని తెలిసి తాను షాకయ్యాయని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఢిల్లీ అల్లర్లపై విచారణ జరుపుతున్న జడ్జీని అర్ధరాత్రి బదిలీ చేయడమేంటనీ ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా. తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను బీజేపీ నీరుగారుస్తుందని మండిపడ్డారు.

Latest Updates