నేడు జస్టిస్ బోబ్​డే ప్రమాణం

17 నెలలపాటు పదవిలో

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్​డే సోమవారం ప్రమాణం చేయనున్నారు. సీజేఐ రంజన్ గొగోయ్ పదవీకాలం ముగియడంతో 63 ఏళ్ల జస్టిస్ బోబ్​డే సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. 17 నెలలపాటు సీజేఐగా కొనసాగనున్నారు. 2021 ఏప్రిల్ 23న రిటైర్ కానున్నారు. మహారాష్ట్రలోని లాయర్ల కుటుంబానికి చెందిన జస్టిస్ బోబ్​డేను సీజేఐగా రెకమెండ్ చేస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్ కేంద్రానికి లేఖ రాశారు. సీజేఐగా జస్టిస్ బోబ్​డేను అపాయింట్ చేస్తూ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ సంతకం చేయగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయోధ్యలో భూవివాదం, రైట్ టు ప్రైవసీ వంటి చరిత్రాత్మకమైన తీర్పులను వెలువరించిన బెంచ్ లలో జస్టిస్ బోబ్​డే కీలక పాత్ర పోషించారు.

ప్రొఫైల్

  • మహారాష్ట్ర లోని నాగ్​పూర్ లో 1956 ఏప్రిల్ 24న పుట్టారు
  • తండ్రి లాయర్ అరవింద్ శ్రీనివాస్ బోబ్​డే
  • నాగ్​పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ ఎల్ బీ
  • 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో లాయర్ గా రిజిస్టర్​ చేసుకున్నారు
  • 21 ఏళ్లపాటు లాయర్ గా సేవలు
  • 1998లో సీనియర్ అడ్వకేట్ గా ప్రమోషన్​
  • 2000 మార్చి 29న బాంబే హైకోర్టు లో అడిషనల్ జడ్జిగా బాధ్యతలు
  • 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రమాణం
  • 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్​

Justice SA Bobde to Take Oath as the 47th Chief Justice of India on monday

Latest Updates