కెనడాలో ఆంక్షలు సడలింపు: కొడుకుతో బయటికి వచ్చిన ప్రధాని

  • లాక్‌డౌన్‌ తర్వాత మొదటి ఫ్యామిలీ ఔటింగ్‌

ఒట్టావో, కెనడా: కరోనా వైరస్‌ కారణంగా కెనడాలో విధించిన లాక్‌డౌన్‌ను సడలించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో కుటుంబంతో కలిసి బయటికి వచ్చారు. క్యూబెక్‌లోని గాటిన్‌క్యూలోని ఐస్‌క్రీమ్‌ పార్లర్‌‌లో కనిపించారు. మాస్క్‌ వేసుకుని, సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటిస్తూ తన ఆరేళ్ల కొడుకుకు ఐస్‌క్రీమ్‌ కొనిస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. లాక్‌డౌన్‌ తర్వాత మొదటిసారి బయటికి వచ్చారు. తనకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందని ప్రధాని కొడుకు అన్నాడు. చాలా రోజుల తర్వాత ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ తింటున్నాను అని చెప్పాడు. కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నందున కెనడా ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.

Latest Updates