నేడు శబరిమలలో జ్యోతి దర్శనం

నేడు శబరిమలలో జ్యోతి దర్శనం
పెరిగిన భక్తుల రద్దీ.. పటిష్టంగా భద్రత

శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం మకరవిలక్కు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు మకరవిలక్కు వేడుకలలో పాల్గొ నడంతోపాటు మకరజ్యోతిని దర్శించుకోనున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా రెండు నెలల దీక్ష చివరిదశకు చేరిన నేపథ్యంలో అయ్యప్ప ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద, పరిసరాల్లో భక్తుల భద్రత, క్రౌడ్ మేనేజ్ మెంట్ కోసం 1400కు పైగా పోలీసులు, ఎన్ డీఆర్ఎఫ్, రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన సిబ్బందిని పెద్ద ఎత్తున నియమించారు.

70 మందితో కూడిన బాంబ్ స్క్వాడ్ ను సిద్ధంగా ఉంచారు. బుధవారం మకరవిలక్కు వేడుకల్లో భాగంగా, అయ్యప్ప స్వామి బాల్యంలో గడిపిన పండలం నుంచి దేవాలయానికి తిరువాభరణాలను ఊరేగింపుగా తీసుకొస్తారు. సాయంత్రం నగలను అయ్యప్ప స్వా మికి అలంకరించి, మహా దీపారాధన చేస్తారు.

Latest Updates