అధికారం పోయి ఆరేళ్లయినా మంత్రుల్లా ఫీలవుతున్నరు

సొంత నేతలపై కాంగ్రెస్‌‌ లీడర్లు సింధియా, జైరాం రమేశ్‌‌ కామెంట్‌‌

కాంగ్రెస్​ సీనియర్​ నేతలు సొంత  లీడర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ అధికారంపోయి ఆరేళ్లు అవుతున్నా మనలో చాలా మంది నేతలు ఇంకా మంత్రుల్లానే ఫీల్‌‌ అవుతున్నారు” అని కాంగ్రెస్‌‌ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, జైరాం రమేశ్‌‌ గురువారం  కామెంట్ చేశారు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్న సింధియా  పార్టీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. లోక్‌‌సభ ఎన్నికల తర్వాత చాలా రాష్ట్రాల్లో  సర్కార్లు ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన… ప్రజల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉందని సింధియా చెప్పారు. “కాంగ్రెస్‌‌ నేతలు  అహంకారం నుంచి బయటపడాలి.  వాళ్ల తీరులో మార్పులు రావాల్సిన అవసరం ఉంది” అని జైరాం రమేశ్‌‌ అన్నారు. ఢిల్లీ రిజల్ట్స్​  కాంగ్రెస్‌‌కు కరోనా విపత్తు లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.  ఢిల్లీలో వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న  కాంగ్రెస్ 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.  మొన్నటి ఎన్నికల్లో 66 మంది కాంగ్రెస్‌‌ కేండిడెట్లు పోటీచేస్తే  63 మందికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ పార్టీ ఇంచార్జ్‌‌ పీసీ చాకో, ఢిల్లీ కాంగ్రెస్‌‌  చీఫ్​ సుభాశ్‌‌ చోప్రా రాజీనామా చేశారు.  షీలా దీక్షిత్‌‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఆమ్‌‌ ఆద్మీ  పార్టీ ఏర్పాటైన తర్వాతే కాంగ్రెస్‌‌ డౌన్‌‌ఫాల్‌‌ మొదలైందని చాకో చేసిన ఆరోపణలు  పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి.

Latest Updates