కాంగ్రెస్ ఆఫీస్ నుంచి సింధియా నేమ్ బోర్డ్ తొలగింపు

మధ్యప్రదేశ్: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా.. బుధవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే భోపాల్‌లోని కాంగ్రెస్ కార్యాలయం లో ఉన్న ‘జ్యోతిరాదిత్య సింధియా, మాజీ ఎంపీ ‘ అనే నేమ్‌ప్లేట్ ను ఆ పార్టీ కి చెందిన వారు తొలగించారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

రెండు రోజుల భారీ ట్విస్ట్ ల తరువాత, గునా మాజీ ఎంపీ సింధియా తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి మంగళవారం అధికారికంగా సమర్పించారు. అంతకుముందు బీజేపీ పార్టీ మాజీ చీఫ్ అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా.. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అతని మద్ధతు తెలిపే 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. అయితే కమలం తీర్థం పుచ్చుకున్న సింధియాకు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Latest Updates