కె.ఏ.పాల్ తల్లి కన్నుమూత

క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కిలారి సంతోషమ్మ, గత రాత్రి (ఆదివారం) కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. అనారోగ్యంతో విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె… రాత్రి 8.30 గంటల సమయంలో మరణించారు

ఈ విషయాన్ని కేఏ పాల్ స్వయంగా ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. ప్రభువుతో ఆమె కలిసిపోయిందని.. జనవరిలో ఆమెతో మాట్లాడడం జరిగిందని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజాశాంతి తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని.. తన తల్లి సంతోషమ్మ సూచించినట్లు చెప్పుకొచ్చారు. సొంత ఇల్లు, కారు, ఒక్క రూపాయి లేకపోయినా.. నిత్యం పేదల బాగు కోసం ఆమె ప్రార్థించే వారని గుర్తు చేసుకున్నారు. ఆమె కన్నుమూయడంతో ప్రపంచమంతా సంతాపాన్ని తెలుపుతోందని కె.ఏ.పాల్ సందేశంలో స్పష్టం చేశారు.  ఆమె అంత్యక్రియలు పాల్ ఆడిటోరియంలో ఇవాళ (సోమవారం, ఫిబ్రవరి 11) సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

Kilari Santoshamma, mother of Dr. K. A. Paul, died on 10th February 2019 at 8:30 pm in Apollo Hospital, Ram Nagar,…

Dr KA Paul 发布于 2019年2月10日周日

Latest Updates