ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే : కేఏ పాల్

సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తనతో పెట్టుకోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. “కేటీఆర్ కు డబ్బులు ఎక్కువైతే.. కాంగ్రెస్ పార్టీ, కోదండరాంతో పెట్టుకోవాలి. నేను ప్రపంచాన్నే జయించాను. కేఏ పాల్ తో పెట్టుకోవద్దు. నేను కృష్ణమాదిగను కాను. 2008లో కేసీఆర్ నా దగ్గరకు వస్తే ఆశీర్వదించాను. మొదట తెలంగాణకు మద్దతు ఇచ్చింది నేను. కేసీఆర్ కు ఫండింగ్ కూడా చేశాను. కేటీఆర్ కు పిచ్చి పట్టింది. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కేటీఆర్ కు డబ్బు, అహంకారం ఎక్కువైంది.

“తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం. ఇంటర్ ఫలితాల కారణంగా.. తెలంగాణలో 23 కుటుంబాలు ఏడుస్తున్నాయి. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా? నేను శాపం పెడితే నాశనం అయిపోతారు. కేటీఆర్ చిన జీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా.. ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్ ను పూజారులు కూడా కాపాడలేరు. గొడవలొద్దు.. కేసీఆర్, కేటీఆర్ శాంతి మార్గంలో నాతో కలసి రావాలి. అమెరికా అధ్యక్షుడిని హైద్రాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దాం. నాకు ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్ ను హైద్రాబాద్ తీసుకొస్తాను. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈ నెల 23న ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఈ నెల 23 తర్వాత ఏపీ ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే. నేను కేసీఆర్, జగన్ కు శత్రువును కాదు” అన్నారు కేఏ పాల్.

Latest Updates