కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి: కేఏ పాల్

KA paul comments on PM MOdi and AP CM Chandrababu nayudu

ప్రధాని మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడితే  దేశంలో శాంతి లేకుండా పోతుందని  ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఈ ఎన్నికల్లో  గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పార్టీల నాయకులందరూ కలసి కష్టపడితే..కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోగలమని అన్నారు. సేవ్ సెక్యులర్ ఇండియా నినాదం తో ముందుకు వెళ్తున్నానని, జాతీయ మీడియా కూడా తనకు మద్దతు ఇస్తే కేంద్రం లో మోడీ రాకుండా చేయచ్చని అన్నారు.

ఏపీలో  జరిగిన ఎన్నికల తీరును ప్రస్తావిస్తూ..  ఒకేసారి 80 శాతం ఈవిఎంలు ఎందుకు పనిచేయకుండా ఆగిపోయాయని, ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగితే, వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పాల్  అన్నారు. పేపర్ బ్యాలెట్ లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ విషయంలో ఇప్పుడిప్పుడే లీడర్స్ అందరూ తనకు మద్దతు ఇస్తున్నారని పాల్ తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు సహకరించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. తాను నాయకత్వం వహిస్తున్నాననే… చంద్రబాబు ఇతర నాయకులపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారన్నారు. తనకు ఎక్కడ  క్రెడిట్ వస్తుందోనని  చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నాని పాల్ చెప్పారు.

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను పాల్ తీవ్రంగా ఖండించారు. శ్రీలంక చాలా శాంతిగల దేశమని, ఆ దేశ అధ్యక్షులు ,ప్రధానిలు తన ఫాలోవర్స్ అని పాల్ అన్నారు.

Latest Updates