కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన కేఏ పాల్

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై  కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏపీలో ఈవీఎంలు పనిచేయ చేయలేదని. అందుకే  రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించాలని అన్నారు. రానున్నఆరు  విడతల ఎన్నికలను అందరూ బహిష్కరించాలన్నారు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలన్నారు. ఎన్నికలు బహిష్కరిస్తే బిజెపి ఎన్నిక చెల్లదని చెప్పారు.  ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ నేతలు తనకు ఇచ్చిన హామీలు విస్మరించారని అన్నారు.  బ్యాలెట్ పేపర్ ద్వార ఎన్నికలు జరపాలని పార్టీలన్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అన్నారు కేఏ పాల్.

Latest Updates