కేఏ పాల్ నామినేషన్: ముందు తిరస్కరణ ఆపై ఆమోదం

ఆంద్ర ప్రదేశ్ ఎన్నికల బరిలో రెండు పార్టీలు మొదటి సారి పోటీ చేస్తున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన. మరోకటి.. ప్రజాశాంతి పార్టీ.. దీనికి అధ్యక్షులు కేఏ పాల్.  ఈ నెల 25వ తారీఖున ఏపీ లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అదే రోజు..కేఏ పాల్.. నరసాపురం పార్లమెంట్ స్థానంలో నామినేషన్ వేసి అసెంబ్లీ స్థానానికి కూడా నామినేషన్ వేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయన అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడంతో నామినేషన్ వెయ్యడానికి ఆలస్యం అయింది.. దీంతో నామినేషన్ ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. మంగళవారం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ల పరిశీలన చేయగా… పత్రాలు సరిగ్గా ఉన్నందున పాల్ నామినేషన్ ను అంగీకరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని కేఏ పాల్ తెలిపారు. తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. అయితే ఆంధ్రాలో ఎనిమిది స్థానాలకు నిలబడిన అభ్యర్థుల పేర్లు అచ్చం.. వైఎస్ఆర్ సీపీ కి చెందిన అభ్యర్థుల పేర్లను పోలివున్నాయని వైసీపీ నాయకులు పాల్ పై ఫైర్ అవుతున్నారు. కావాలనే తమ అభ్యర్థుల పేర్లను పోలి ఉండేలా చూసి నిలబెట్టారని ఆరోపించారు. ఇప్పటికే ఫ్యాన్ గుర్తును పోలి ఉండేలా హెలికాప్టర్ గుర్తును తెచ్చుకున్నారని వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి పాల్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో పాటే.. వైసీపీ జెండాను పోలి ఉండేలా ప్రజాశాంతి పార్టీ జెండా ఉండటంతో.. పాల్ పై మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు.

Latest Updates