‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పై హైకోర్టులో పిటిషన్

ఎన్నో వివాదాల మధ్య ఆర్జీవీ తెరకెక్కిస్తున్న సినిమా కమ్మరాజ్యంలో కడప రెడ్లు. పాటలు, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు వారం ముందు.. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తనను అవమానించేలా ఉన్నాయంటూ కేఏ. పాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కాసేపట్లో హైకోర్టులో విచారణకు రానుంది. కేఏ. పాల్ ఈ పిటిషన్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ, సెన్సార్ బోర్డు, రాంగోపాల్ వర్మ, జబర్దస్త్ కమెడియన్ రాములను ప్రతివాదులుగా చేర్చారు.

కాగా.. ఆర్జీవీ ఈ సినిమాకు సంబంధించి రెండో ట్రైలర్‌ను నిన్న విడుదల చేశారు. అది యూట్యూబ్‌లో 3 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

Latest Updates